వామ్మో ... హోటల్ లో ఇంత దారుణమా ??

                          ఇంత దారుణమా
హైదరాబాద్‌లో రెస్టారెంట్ల పరిస్థితి దారుణంగా మారింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా.. పేరుకేమో రుచికి శుచికి మారుపేరు అని చెప్పుకునే పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లు, ఫ్రిడ్జ్‌లు ఓపెన్ చేసి చూస్తే అసలు బండారం బయటపడుతోంది. కుళ్లిన మాసం, కల్తీ మసాలాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడటమే కాదు.. కిచెన్‌లో అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తున్నారన్నది ఫొటోలతో సహా అధికారులు బయటపెట్టారు.అయితే.. ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు.. అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్‌పైరీ డేట్‌ దాటిన ప్రొడక్ట్స్‌, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే.. ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదండోయ్.. నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించటం ఆందోళనకరం.

కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం అందిస్తోన్న రెస్టారెంట్ల పేర్లతో కూడిన ఓ జాబితాను అధికారులు విడుదల చేశారు కూడా. ఏఏ రెస్టారెంట్లు, హెటల్స్‌లో ఏ తేదీల్లో సోదాలు నిర్వహించారన్న వివరాలతో పాటు.. అక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల మధ్య ఆహారాన్ని తయారు చేస్తున్నారన్నది వివరించే ఫొటోలను కూడా ట్విట్టర్ వేదికగా షేర్‌ చేశారు. మరి ఆ లిస్ట్‌ మీరూ చూడండి.. అందులో మీ ఫెవరెట్ రెస్టారెంట్ కూడా ఉందేమో ఓ సారి చెక్ చేసుకోండి..!

Comments

Popular posts from this blog

సుధా చంద్రన్

"బుజ్జి - బైరవ " టీజర్ వచ్చేశారు