మరో బయోపిక్ లో కీర్తి సురేష్...????

కీర్తి సురేష్ గురించిన ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ వార్త ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. కానీ, వచ్చిన ప్రతిసారి నిజమేనా అని ఆతృతను మాత్రం తీసుకొస్తుంది. అదేంటంటే.. కీర్తిమరో లెజండరీ సెలబ్రిటీ బయోపిక్ లో నటిస్తుంది అని. ఇప్పటికే సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి, సావిత్రి పాత్రలో నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి.

  ఇంకా చెప్పాలంటే ఈ తరం జనరేషన్ కు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా ఆమె ఒదిగిపోయింది. ఇక మరోసారి ఆమె బయోపిక్ లో నటిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. లెజండరీ సింగర్ దివంగత ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కీర్తి నటిస్తుందని అంటున్నారు. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రం, ఆమె పాడిన పాటలు మర్చిపోవడం చాలా కష్టం.

                     కీర్తి సురేష్

Comments

Popular posts from this blog

సుధా చంద్రన్

"బుజ్జి - బైరవ " టీజర్ వచ్చేశారు