వచ్చే నెల మొదటివారంలో సునీత రోదసి యాత్ర

వచ్చే నెల మొదటివారంలో సునీత రోదసి యాత్ర


భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వచ్చే నెల 1 నుంచి 5 మధ్య జరిగే అవకాశం ఉంది. బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్ వ్యోమనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత రోదసి యాత్ర. ఈ నెల 6న దీని ప్రయోగానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్యతో అది నిలిచిపోయింది. స్టారైనర్ పనితీరును విశ్లేషించేందుకు ఇంజినీర్లు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. వ్యోమనౌకలోని సర్వీసు మాడ్యూల్లో చిన్నపాటి హీలియం లీకేజీని గుర్తించడంతో అన్ని వ్యవస్థలనూ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యోమనౌకలో సునీతతో పాటు బుచ్ విల్మార్ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాట తో బసచేస్తారు.

Comments

Popular posts from this blog

సుధా చంద్రన్

"బుజ్జి - బైరవ " టీజర్ వచ్చేశారు